BREAKING
ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం!

మహిళా శక్తితోనే వికసిత భారత్‌ సాధ్యం.. 15 వేల మందికి నైపుణ్య శిక్షణ: కేంద్ర మంత్రి పెమ్మసాని

Select Suryaa Now
మహిళా శక్తితోనే వికసిత భారత్‌ సాధ్యం.. 15 వేల మందికి నైపుణ్య శిక్షణ: కేంద్ర మంత్రి పెమ్మసాని

విజయవాడ, మేజర్ న్యూస్: మహిళా శక్తిని ఆర్థిక శక్తిగా మార్చడం ద్వారా వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. మహిళలు మార్కెట్‌కు వెళ్లేవారిగానే కాకుండా మార్కెట్‌ను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. విజయవాడలో గురువారం నిర్వహించిన జాతీయ సరస్‌ మేళా ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న ఆరు కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఇప్పటికే సుమారు మూడున్నర కోట్ల మంది మహిళలు లక్ష్యాన్ని చేరుకున్నారని వెల్లడించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒడిశాలోని మారుమూల గిరిజన ప్రాంతం నుంచి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపది ముర్ము జీవితం మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు, సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2014లో సుమారు రూ.23 వేల కోట్లుగా ఉన్న మహిళా సంఘాల వార్షిక రుణ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు సుమారు రూ.13 లక్షల కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలపై ప్రాసెసింగ్‌, తనిఖీ, పత్రాల నిర్వహణ తదితర రుసుములను రద్దు చేయడం ద్వారా ఒక్కో సంఘానికి సుమారు రూ.33 వేల వరకు ఆదా అయ్యే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని, ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిందని చెప్పారు. మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు లోకోస్‌ వంటి డిజిటల్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గతంలో ఢిల్లీకి పరిమితమైన జాతీయ సరస్‌ మేళాను విజయవాడలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది మహిళా ప్రతినిధులు హస్తకళలు, చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ వస్తువులను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. మేళా సందర్భంగా రానున్న 15 రోజుల్లో రోజుకు సుమారు వెయ్యి మంది చొప్పున రాష్ట్రానికి చెందిన 15 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మెరుగైన ధరలు, విస్తృత మార్కెట్లు కల్పించేందుకు నాణ్యత పెంపు, ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, పెద్ద వ్యాపార సంస్థలు, చిల్లర మార్కెట్లతో అనుసంధానం, ఆన్‌లైన్‌ విక్రయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులు, ఆసక్తి ఉన్న మహిళలు సరస్‌ మేళాను సందర్శించి శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. గ్రామీణ మహిళలు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగంతో పాటు వ్యాపారాభివృద్ధిలోనూ ముందుకు సాగాలని, వారికి సరైన అవకాశాలు, శిక్షణ, ఆర్థిక సహకారం అందిస్తే స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అనేక కుటుంబాలకు ఉపాధి కల్పించగలరని పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. జాతీయ సరస్‌ మేళా నిర్వహణకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.