BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు

Select Suryaa Now
మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం..   నిందితుడికి ఐదేళ్ల జైలు

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : మహిళా న్యాయవాదిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు బంకా శివకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 12వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జి. సుబ్రహ్మణ్యం సోమవారం తీర్పు వెల్లడించారు. 2017 అక్టోబర్ 10న కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకా కామరాజు వారి వీధిలో న్యాయవాది ఇంట్లో ఉండగా నిందితుడు మరో ఇద్దరితో కలిసి వచ్చి ఆమెపై దాడి చేసి, కేసు వెనక్కి తీసుకోకపోతే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అప్పటి ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, అక్టోబర్ 13న నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో 13 మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతా పూర్ణిమ వాదనలు వినిపించారు. ఇన్‌స్పెక్టర్ చిన్న కొండలరావు, సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ వాసవి, సిబ్బంది కేసు విచారణలో సహకరించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.