BREAKING
రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్ లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు.....

మదనపల్లె మెడికల్ కళాశాలకు చంద్రగ్రహణం పట్టింది

Select Suryaa Now
మదనపల్లె మెడికల్ కళాశాలకు చంద్రగ్రహణం పట్టింది


- మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
- మదనపల్లె వైకాపా సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ విమర్శలు
మదనపల్లె : మదనపల్లె ప్రజల చిరకాల ఆకాంక్షగా,ఈ ప్రాంత పేద,మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చంద్రగ్రహణం పట్టిందని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్.నిసార్ అహ్మద్ తీవ్రంగా విమర్శించారు.బుధవారం ఎస్.నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడి నిర్మాణ పనులు,మౌలిక వసతులను పరిశీలించారు.వైఎస్ జగన్ హయాంలో మదనపల్లెకు మెడికల్ కాలేజీని మంజూరు చేసి జూన్ 2022లో 95 ఎకరాల విలువైన భూమిని కేటాయించి,85 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడంతో,ఈ కళాశాల పూర్తయితే ఆయనకు పేరు వస్తుందని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే 150 మెడిసిన్ సీట్లు 24 పి.జి సీట్లు వస్తాయని పేద విద్యార్థులు,తల్లిదండ్రులు ఆశించారు.24 పిజి సీట్లు వస్తే స్థానికంగా వైద్య నిపుణుల సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావించారు.625 పడకల ఆసుపత్రి వస్తే మదనపల్లెతోపాటు అన్నమయ్య జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,మరి ఈ హామీలు ఎప్పుడు ఆచరణలోకి వస్తాయని ఆయన ప్రశ్నించారు.మదనపల్లెకు వచ్చిన ఈ మెడికల్ కాలేజీ ప్రజల ఆస్తి.ఇది ఏ పార్టీకి చెందిన ఆస్తి కాదు.పేదల పిల్లలు డాక్టర్లు కావాలి,పేదలకు మెరుగైన వైద్యం అందాలి అదే ఈ కళాశాల లక్ష్యం.అలాంటి ప్రజా ప్రాజెక్టును రాజకీయ కక్షలు,అనాలోచిత నిర్ణయాలతో ఆలస్యం చేయడం మదనపల్లె ప్రజలకు అన్యాయమని,పిపిపి విధానంలో కూడా ఎవరూ ముందుకు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నిసార్ అహ్మద్  విమర్శించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్,బయ్యా రెడ్డి,నరసింహులు నాయుడు,ముజీబ్,వడిగల శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.