BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

మాటల కాదు శాశ్వత పరిష్కారాలే మా లక్ష్యం

Select Suryaa Now
మాటల కాదు శాశ్వత పరిష్కారాలే మా లక్ష్యం

 

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

నగరంలో ప్రజలకు శాశ్వత పరిష్కారాలు చూపించే దిశగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2, 3, 4, 8 డివిజన్లకు సంబంధించి రూ.1.80 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ప్రారంభమయ్యే సుమారు కిలోమీటరు పొడవైన రహదారి నాలుగు డివిజన్లను అనుసంధానం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఐదు మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బీటీ రోడ్డును రూ.1.80 కోట్లతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు వెడల్పును ఏడు మీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలను కూడా అభివృద్ధి చేసి, రహదారికి శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ రహదారి గత ఐదారు సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలకు అత్యంత అవసరమైన, రద్దీగా ఉండే రహదారి కావడంతో దీనిని బీటీగా కొనసాగించకుండా సీసీ రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సోమవారం నుంచి పనులు ప్రారంభమై రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను వీడియోలు తీసి ప్రచారం చేసుకోవడం నాయకత్వ లక్షణం కాదని, సమస్యను అధ్యయనం చేసి దానికి శాశ్వత పరిష్కారం చూపించడమే నిజమైన నాయకత్వమని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. హైటెక్ బస్‌స్టాండ్ వద్ద దశాబ్దాలుగా కొనసాగుతున్న ముంపు సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు. పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా రూ.6 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రూ.2 కోట్లతో మొత్తం రూ.8 కోట్లతో చేపట్టనున్న పనులకు ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.

*ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం నగరానికి గర్వకారణం :*

ఆర్ట్స్ కళాశాల ముఖద్వారాన్ని ఆధునీకరించడం ద్వారా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. వేలాది మంది విద్యార్థులు చదువుతున్న ప్రతిష్టాత్మక కళాశాల ముఖద్వారం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం పట్ల విద్యార్థులు, అలుమ్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నగర గౌరవం, ప్రతిష్టను పెంచేలా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పనులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, తణుకు పరిశీలకులు నక్కా చిట్టిబాబు, నగర టిడిపి అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, నాయకులు జక్కంపూడి అర్జున్, బొమ్మనమైన శ్రీను, సలాది ఆనంద్, దొంగ నాగమణి, అహ్మదున్నీసా అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.