మార్కాపురంలో డ్రైన్ల ఆక్రమణలపై ప్రజల ఆగ్రహం
మార్కాపురం పట్టణంలో డ్రైన్లు, మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించాలంటూ ప్రజల డిమాండ్. మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని విజ్ఞప్తి. ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో డ్రైన్లపై అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. డ్రైన్ల ఆక్రమణలతో రహదారులు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారుల ఆవేదన. ఆర్టీసీ బస్టాండ్ నుండి తర్లుపాడు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వరకు చేరుకోవడానికి అరగంట సమయం పడుతోందని వాహనదారుల ఆవేదన. సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజల విజ్ఞప్తి. ఆక్రమణలను తొలగించి మురుగు పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజల డిమాండ్