మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి.
మార్కాపురం, మేజర్ న్యూస్.,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 32 మరియు 35 వార్డుల్లో పర్యటించి నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమం నకు విచ్చేసిన శాసనసభ్యుల వారికి మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ
హెచ్ ఏ ఎం పథకం ద్వారా మార్కాపురం పట్టణానికి 35 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి అని ఈ నిధులు ద్వారా పట్టణంలో అంతర్గత సిసి రోడ్లను భారీ ఎత్తున నిర్మిస్తామని తద్వారా అంతర్గత రోడ్లలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రయాణం సాగిస్తారని మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణానికి ఈ అంతర్గత సిసి రోడ్లు ఎంతగానో అభివృద్ధికి దోహదపడతాయని పెరిగిన జనాభా దృష్ట్యా రోడ్లు అత్యంత అవసరమని ప్రతిరోజు మార్కాపురం పట్టణానికి కొన్ని వేలమంది రాకపోకలు సాగిస్తున్నారని రోడ్లే కాక మరిన్ని మౌలిక సదుపాయాలు మార్కాపురం పట్టణానికి కల్పించి త్వరలోనే మార్కాపురాన్ని అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.