మానవత ఆధ్వర్యంలో రూ.6 వేల ఆర్థిక సహాయం,
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ మండలంలో కేతవరం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం మండల అధ్యక్షుడు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. మానవత కార్యదర్శి బేత రమేష్ తెలిపారు, ఈసీ సభ్యుడు మాగంటి ముక్క రాజు సమక్షంలో జరిగిన ఈ సమావేశంలోమానవత సంస్థ తరఫున రూ.5,000, మండల అధ్యక్షుడు తన్నీరు రామకృష్ణ రూ.1,000 కలిపి మొత్తం రూ.6,000లను వాసిరెడ్డి వెంకన్నకు ఆర్థిక సహాయంగా అందజేశారు. అలాగే 50 సార్లు రక్తదానం చేసిన పెద్దమల్ల బాలును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు పసల వెంకట సుబ్బారావు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, రామిశెట్టి శ్రీనివాసరావు మద్ది డైరెక్టర్ ధూళిపాళ్ల ప్రభాకర్ పులి శివ గ్యాలం కృష్ణ ఆదిలక్ష్మిణస్వామి ఆనం వెంకట శ్రీనివాస్ చేతి శ్రీను గోకా యేసు గోకా రామకృష్ణ వరద బుచ్చిరాజు పోల్నాటి గంగరాజు కవులూరి కాట్రాజు బోనగిరి వెంకటరమణ తలారి వెంకట్ నల్లమొని విష్ణు ఆది నాగు తలారి తేజ రాజనాల రామకృష్ణ తదితరులుపాల్గొన్నారు.
రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,