మాజీ సీఎం జగన్ ను కలిసిన ఎంబీసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న
తాడేపల్లి / నర్సాపురం, మేజర్ న్యూస్ :మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 31న జరిగిన సంచారజాతుల స్వతంత్ర దినోత్సవ వేడుక,గత నెల 27న రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జన సభకు సంబంధించిన అంశాలను జగన్ కు వివరించారు.అనంతరం జగన్ మోహన రెడ్డి మా మాట్లాడుతూ మరింత చురుకుగా పనిచేయాలని. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించినట్లు వీరన్న తెలిపారు.
స్టాప్ రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా