మాజీ మంత్రికి రఘువీరారెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
ఉండి, మేజర్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డికి ఉండి పెద్ద వంతెన సెంటర్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం కార్యక్రమం నిర్వహించారు. భీమవరంలో పార్టీ కార్యక్రమం నిమిత్తం వెళ్తున్న ఆయనను ఉండిలో కాంగ్రెస్ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆయనకు సాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీ కోసం మరింత కష్టపడి పని చేయాలని 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అడబాల శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఈతకోట రాజు. ఉండి పశ్చిమగోదావరి జిల్లా