క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన విశ్రాంత డి ఎస్ పి!
పుంగనూరు మేజర్ న్యూస్ :
పట్టణానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు విశ్రాంత డీఎస్పీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుకుమార్బాబు సుమారు రూ.20 వేల విలువైన క్రికెట్ కిట్లను మంగళవారం క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత డి.ఎస్.పి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతాయని తెలిపారు. గతంలోనూ క్రికెట్, వాలీబాల్, షటిల్ తదితర క్రీడా సామగ్రిని 50కిపైగా టీములకు అందించినట్లు ఆయన తెలిపారు. క్రీడా కిట్లు అవసరమైన యువకులు తనను సంప్రదిస్తే వారికి కిట్లను అందజేస్తానని , త్వరలో వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన క్రీడాకారులు గిరీష్, సాయి, ఈశ్వర్, పురుషోత్తం, నవీన్, వెంకటేష్, రెడ్డి, గణేష్తదితరులుపాల్గొన్నారు.
రిపోర్టర్ :రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా