BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కోటబొమ్మాళిలో ఆధ్యాత్మిక శోభ... అంగరంగ వైభవంగా ప్రారంభమైన కొత్తమ్మతల్లి జాతర

Select Suryaa Now
కోటబొమ్మాళిలో ఆధ్యాత్మిక శోభ... అంగరంగ వైభవంగా ప్రారంభమైన కొత్తమ్మతల్లి జాతర

కోటబొమ్మాళి, సూర్య : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలు మంగళవారం భక్తిప్రపత్తులు, సంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలతో కోటబొమ్మాళి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్ర స్థాయి పండుగగా వరుసగా మూడోసారి నిర్వహిస్తున్న ఈ జాతరను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణలు, పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రులు ఇరువురు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి జ్ఞాపికను అందించి మంత్రులను సత్కరించారు. రాష్ట్ర ప్రజలందరిపై కొత్తమ్మతల్లి అమ్మవారి కటాక్షం ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రులు ఆకాంక్షించారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర స్థాయి పండుగగా నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు ఎం. కృష్ణమూర్తి, ప్రత్యూష, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పిఎసిఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, కొత్తమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్ గోవిందరావు, ఈఓలు గురునాథం, రాధాకృష్ణ, దేవాదాయ శాఖ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : అప్పన్న, కోటబొమ్మాలి, శ్రీకాకుళం జిల్లా.