కొండపేట రైతుబిడ్డకు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు
కొండపేట రైతు బిడ్డకు జనసేనలో కీలక బాధ్యతలు!
కడప పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులుగా శివ గోవింద గారి
జనసేన పార్టీ అధిష్టానం కడప జిల్లాలో పార్టీబలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది.ఇందులో భాగంగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం లోని చెన్నూరు మండలం,కొండపేట గ్రామానికి, చెందిన రైతు బిడ్డ ప్రముఖ జనసేన నాయకుడు గోవిందు గారివెంకట శివ ప్రసాద్ ను కడప పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులుగా నియమించారు.ఈ మేరకు పార్టీ ఉన్నతాధికారుల నుంచి అధికారిక ఉత్తర్వులు అందాయి.గత కొంతకాలంగా పార్టీ ఆశయాలకు కట్టుబడి, జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల ప్రకారం సమాజసేవలో మరియు పార్టీ బలోపేతానికి వెంకట శివప్రసాద్ చేసిన కృషిని గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.కొండపేట గ్రామానికి చెందిన ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఎదిగి,ఈరోజు పార్లమెంట్ స్థాయి కీలక పదవిని దక్కించుకోవడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కడప, క్రైమ్ రిపోర్టర్, వేణు.