కంబాలదిన్నె సర్పంచ్ బరిలోకి ఏలూరి మాధవరావు !
- జనరల్‌గా ఖరారైన సర్పంచ్ స్థానం
- ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో పోటీకి సై
- రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్న గ్రామస్తులు
పామూరు, మేజర్ న్యూస్
: కంబాలదిన్నె గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్‌గా ఖరారు కావడంతో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పామూరు మండలంలోని కంబాలదిన్నె గ్రామానికి చెందిన ఏలూరి మాధవరావు (కోటయ్య) సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాధవరావు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సై అంటున్నట్లు సమాచారం. గ్రామంలో మాధవరావుకు ఉన్న పరిచయాలు, ప్రజలతో సత్సంబంధాల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వంపై స్థానికంగా చర్చ సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థిగా మాధవరావు పోటీ చేసే అంశంపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. దీంతో కంబాలదిన్నె పంచాయతీ ఎన్నికల్లో మాధవరావు పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది.