BREAKING
వర్లీలో గొర్రెల మందపై చిరుత పులి దాడి, గొర్రె, పిల్ల మృతి. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మాటూరి అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు...నష్టాలతో ప్రారంభం కానున్న భారతీయ స్టాక్ మార్కెట్లు స్విట్జర్లాండ్‌కు షాక్...హెడ్‌క్వార్టర్స్‌ను తరలించే ఆలోచనలో ప్రముఖ యూబీఎస్ బ్యాంక్ కంబాలదిన్నె సర్పంచ్‌ బరిలోకి ఏలూరి మాధవరావు ! వాయు కాలుష్యం తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి రష్యా షాడో ఫ్లీట్‌పై కఠిన ఆంక్షలు విధించాలి...బ్రిటన్ ఆర్థిక మంత్రి జాన్ హేలీ పిలుపు మధిర మండలం సిరిపురం టోల్గేట్ వద్ద ప్రమాదం బ్రెజిల్‌ లో తక్కువ పనిగంటల బిల్లుకు ఆమోదం గుత్తి, గుంతకల్లు రూరల్,సీఐలుగా కొత్త అధికారుల నియామకం ఉత్తరాంధ్రపై ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోకస్.. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చే సమ్మర్‌లో థియేటర్లలోకి 'ఇండియన్ 3'.. కమల్ హాసన్ అభిమానులకు గుడ్ న్యూస్ మల్లారెడ్డి యూనివర్సిటీలో శ్రీలీల సందడి.. బతుకమ్మ, దాండియా వేడుకల్లో మాస్ జాతర నేడు బీజేపీ మహిళా మోర్చ బతుకమ్మ వేడుకలు బిగ్ బాస్‌లో మాటల యుద్ధం: 'నువ్వు యాక్టింగ్ ఆపు' అంటూ శివకుమార్‌పై రోహిత్ ఫైర్!

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: నేడు లలితా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం..

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: నేడు లలితా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం..

విజయవాడ, సూర్య ప్రతినిధి : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయమైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన నేడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అభయమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. గోవింద, అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

ఇక ఉత్సవాల్లో అత్యంత కీలకమైన, పవిత్రమైన మూలా నక్షత్రం పర్వదినం కావడంతో రేపు (శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మూలా నక్షత్రం రోజైన రేపు అమ్మవారు జ్ఞాన సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సీఎం పర్యటన మరియు మూలా నక్షత్రం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, ప్రత్యేక దర్శనాలపై ప్రత్యేక దృష్టి సారించారు.