కెవికెలో ఘనంగా రైతు మహిళా దినోత్సవం
ఉండి, మేజర్ న్యూస్: కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, డాక్టర్ నామాల శ్రీనివాసరావు అధ్యక్షతన రైతు మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జి సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి మహిళా రైతులు, మహిళా వ్యాపారవేత్తలు మరియు ప్రకృతి వ్యవసాయ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి సునీత మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమని, కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లయితే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలంతా కృషి విజ్ఞాన కేంద్రం సేవలను వినియోగించుకుని ఇంటి నుండే వ్యాపారవేత్తలుగా ఎదగాలని, అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉండి లో వివిధ వృత్తి విద్య శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా శిక్షణ అనంతరం ఆర్థిక సహాయం మార్కెటింగ్ సదుపాయం కొరకు వారిని బ్యాంకులు మరియు వివిధ సంస్థలతో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది ఈ సందర్భంగా మహిళా రైతులు, మహిళా వ్యాపారవేత్తలు వారి యొక్క అనుభవాలను మిగిలిన మహిళలతో పంచుకున్నారు. రైతు మహిళా దినోత్సవం సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ఉండి తరపున ప్రకృతి వ్యవసాయం చేసే ఉత్తమ మహిళా రైతులను మరియు కెవికె నుండి శిక్షణ పొంది వ్యాపారవేత్తలుగా మారిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు ప్రతాప్ జీవన్, జాన్సన్, జిల్లా వనరుల కేంద్రం భీమవరం, కె.వికే శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా, డాక్టర్ ఏ శ్రీనివాసరావు, డాక్టర్ పి వినయలక్ష్మి, రాజమండ్రి వ్యవసాయ కళాశాల విద్యార్థులు మరియు మహిళ రైతులు పాల్గొన్నారు.
ఈతకోట రాజు ఉండి రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లా