BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

కెల్ల వినాయక ఉత్సవంలో భారీ అన్నదాన కార్యక్రమం

Select Suryaa Now
కెల్ల వినాయక ఉత్సవంలో భారీ అన్నదాన కార్యక్రమం

 

గుర్ల, సెప్టెంబర్28మేజర్ న్యూస్: వినాయక ఉత్సవాల్లో భాగంగా కెల్ల గ్రామంలోఅంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని  సోమవారం ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు రాజాం నియోజకవర్గ పరిశీలకులు కె.వి. సూర్యనారాయణ రాజు (పులిరాజు)  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ముందుగా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అక్కడ జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని, భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక ఉత్సవాలు జరుపుకోవడం వలన యువతలో భక్తి భావన పెరుగుతుందన్నారు.యువత కలిసికట్టుగా ఉండి  అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. ముఖ్యంగా చెడు మార్గాల వైపు కాకుండా సన్మార్గంలో నడుచుకోవడం శ్రేయస్కరం అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.