BREAKING
నేటి రాశి ఫలాలు –4 నవంబర్, 2026 నేటి పంచాంగం4 నవంబర్, 2026 పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

కౌంటింగ్ సిబ్బందికి ఏమైంది..?

Select Suryaa Now
కౌంటింగ్ సిబ్బందికి ఏమైంది..?

విజయనగరం బ్యూరో, సూర్య : విజయం ఎవరిది? ఓటమి ఎవరిని పలకరించనుంది? ప్రజాతీర్పు ఎటువైపు మొగ్గుచూపింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన వేళ.. కౌంటింగ్ కేంద్రంలో మాత్రం అంతులేని జాప్యం నెలకొంది. గంటలు గడుస్తున్నా ఫలితాల జాడ లేకపోవడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి నుంచీ మందకొడిగా సాగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం దాటి సాయంత్రం సమీపిస్తున్నా ఫలితాల ప్రకటనకు నోచుకోలేదు. దాదాపు ఏడు గంటల సమయం గడిచినా అధికారికంగా ఫలితాలు వెల్లడించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతసేపు కేవలం ఓట్ల విభజన, వాటిని కట్టలుగా కట్టే ప్రక్రియకే సరిపోయిందన్న పరిస్థితి నెలకొంది.
కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతోంది? ఫలితాల ప్రకటనకు ఇంత సమయం ఎందుకు పడుతోంది? అనే ప్రశ్నలు పోటీలో ఉన్న అభ్యర్థులను వేధిస్తున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాతీర్పు కోసం అభ్యర్థులు, వారి అనుచరులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం గడిచేకొద్దీ ఉత్కంఠ మరింత పెరిగింది. సాయంత్రం సమీపిస్తున్నా ఫలితాలు వెలువడకపోవడంతో రాజకీయ పార్టీల శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కౌంటింగ్ కేంద్రం లోపల జరుగుతున్న పరిణామాలపై బయట ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.
జేసీ అసహనం!
కౌంటింగ్‌లో జాప్యంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కౌంటింగ్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసి, ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ జోక్యంతోనైనా ఫలితాల ప్రకటనలో వేగం పెరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రజాతీర్పు కోసం నిరీక్షణ
ఎన్నికల కౌంటింగ్ అంటే గంటల వ్యవధిలోనే ఫలితాలపై స్పష్టత రావాల్సి ఉంటుంది. అయితే విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపులో నెలకొన్న జాప్యం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఓట్ల లెక్కింపు ప్రారంభమై గంటలు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించకపోవడం.. కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతోందన్న సందేహాలకు తావిస్తోంది.