కనీస వేతనాలు చెల్లించాలని ఎ.పి. ఆశా వర్కర్స్ యూనియన్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా
నర్సీపట్నం ఆశావర్కర్స్క కనీసవేతనాలు చెల్లించాలని, పర్మినెంట్ చేయాలని, అన్నిరకాల సెలవులు ఇవ్వాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, శిక్షణ పొందిన ఎఎన్ఎం, జిఎన్ఎం భర్తీసందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని కోరుతూ నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ ఎత్తున ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారురాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 6న ఆశా డేను బహిష్కరించి, ఎం.ఎల్.ఏ, ఎం.పి లను కలసి వినతి పత్రాలు అందిస్తున్నట్టు ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు సత్యవతి తెలిపారు ఆశా వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. వేతనాలు పెంచి 7 సంవత్సరాలు ధరలకు అనుగుణంగా ఆశావర్కర్కు వేతనాలు పెంచాలని కోరుతున్నాము. 20 సంవత్సరాలుగా ఆశావర్కర్లకు శెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలౌతున్నారు. అంగన్వాడీలకు అమలవుతును (వేసవి శెలవులు మినహా) ఆశావర్కర్లుకు అమలు చేయాలని కోరుచున్నాము. ప్రభుత్వం చెల్లించే 10 వేలలో మరియు ఆసుపత్రులకు వెళ్ళడానికి 3,4 వేలు ఖర్చులవుతున్నాయి. సంబంధంలేని పనులు చేయటం వలన ఆశావర్కర్స్ తీవ్ర పనిఒత్తిడికి గురై అనారోగ్యంపాలౌతున్నారు అని ఆశ వర్కర్లు తెలిపారు. ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా నర్సీపట్నం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె గఫూర్. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రేవతమ్మ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు