కళ్ళకు గంతలు తీరు..కాళ్లు కదపరు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు.
ఉదయగిరి మేజర్ న్యూస్ : ఉదయగిరి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికార మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఏ పల్లెలో చూసిన గుక్కెడు నీరు కరువైంది కానీ మద్యానికి మాత్రం కొదవలేదు ప్రతి పంచాయతీలో ఐదు నుంచి 6 అనధికార మధ్య దుకాణాలు వెలసి బాటిల్ పైన 50 నుంచి 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. 24 గంటలు పల్లె పట్టణాలు తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉంటుంది లైసెన్స్ దుకాణదారులు ఏకంగా తెల్లవారుజాము నుంచే మధ్య విక్రయాలు చేపడుతున్నారు ప్రభుత్వం నిర్ణయించిన సమయపాలన ఏమాత్రం పాటించకుండా తమ అమ్మకాలను సాగిస్తున్నారు ఇవన్నీ తెలిసిన ఎక్సైజ్ అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని కార్యాలయం నుంచి కాళ్లు కలపడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దుకాణా దారుడు నెల నెల అందిస్తున్న మామూళ్లతోనే వారు ఎదుట అనధికార మద్యం విక్రయాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ విచ్చలవిడి మధ్య విక్రయాలతో పచ్చని పల్లెల్లో చిచ్చు రేపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికార మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించిబెల్టు షాపులను నివారించాలని పలువురు కోరుతున్నారు.