కావలిలో ఘనంగా జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం!
కావలి, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ కావలి అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ మన్నె మార్ల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు సూచించారు. కావలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.