BREAKING
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ నాటుసారా స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. వాహనాలు సీజ్ క్యాన్సర్ ఔషధాల కుంభకోణం.. ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి ఎగుమతులు, హై-ఎండ్ తయారీ రంగానికి ఊతం

కావలి మాజీ మున్సిపల్ ఛైర్మన్, ‘ప్రజా వైద్యుడు’ డా. ఎన్. ప్రభాకర్ నాయుడు మృతి తీరని లోటు: ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర.

Select Suryaa Now
కావలి మాజీ మున్సిపల్ ఛైర్మన్, ‘ప్రజా వైద్యుడు’ డా. ఎన్. ప్రభాకర్ నాయుడు  మృతి తీరని లోటు: ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర.


కావలి మేజర్ న్యూస్  :   ​కావలి పట్టణ మాజీ మున్సిపల్ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అందరిచే ‘ప్రజా వైద్యుడు’గా నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు  అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ,  ఒక ఆత్మీయుడిని, నిబద్ధత కలిగిన మార్గదర్శకుడిని కోల్పోయాను.  ​విడదీయరాని ఆత్మీయ బంధం: డాక్టర్ ప్రభాకర్ నాయుడు తో నాది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు. విడదీయరాని ఒక పేగుబంధం లాంటి ఆత్మీయ అనుబంధం. వారి మరణం తెలుగుదేశం పార్టీకి భరించలేని లోటు మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా నాకు తీరని శోకాన్ని మిగిల్చింది.
​ప్రజా సేవలోనే జీవితం ధన్యం: 1980వ సంవత్సరంలో కావలి పట్టణంలో అడుగుపెట్టిన నాటి నుండి, డాక్టర్ ప్రభాకర్ నాయుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందించారు. లాభాపేక్ష లేకుండా, వైద్య రంగాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి వేలాది మంది పేదల ప్రాణాలను నిలిపారు. అందుకే కావలి ప్రజలు వారిని వైద్యుడిగా కాకుండా, ఇలవేల్పులా తమ గుండెల్లో నిలుపుకున్నారు.  
​పార్టీ బలోపేతంలో క్రియాశీల పాత్ర: వైద్యుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ క్రమశిక్షణకు మరొక రూపంగా నిలిచారు. కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు బాధ్యతలు చేపట్టి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పలు బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.   ​డాక్టర్ ప్రభాకర్ నాయుడు  మరణంతో తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్, నిబద్ధత కలిగిన దిగ్గజాన్ని కోల్పోయింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ తీవ్ర దుఃఖసమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.