కావలి 36వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా ధారా అల్వినా.
కావలి, మేజర్ న్యూస్: కావలి పట్టణంలోని 36వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా బోగోలు మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు దారా సుధాకర్ కుమార్తె ధారా అల్వినా పోటీ చేయనున్నట్లు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో, కావలి పట్టణ మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్న ఆంజనేయులు సహకారంతో ధారా అల్వినా ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, యూపీఎస్సీ (UPSC) వంటి అత్యున్నత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యావంతులైన యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. ధారా అల్వినా రాజకీయ ప్రవేశం నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో 36వ వార్డు ఓటర్లు మరియు ప్రజలందరూ ధారా అల్వినాకు తమ సంపూర్ణ మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.