BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు వైసీపీ యువనేత కావాలి కృష్ణ తేజ

Select Suryaa Now
  కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు వైసీపీ యువనేత కావాలి కృష్ణ తేజ

వేంపల్లె మేజర్ న్యూస్:
కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, వైఎస్ఆర్సిపి అధిష్టానం తమకు నిర్దేశించిన గుర్తింపుతో పార్టీ అభివృద్ధికి దోహద పడాలని గండి దేవస్థానం మాజీ ఛైర్మన్, యువనేత కావలి కృష్ణతేజ సూచించారు. మంగళవారం ఇడుపులపాయ గ్రామ పంచాయతీలోని మారుతి నగర్ ప్రాంతానికి చెందిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా సమిష్టి కృషి అందించాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతిరెడ్డి శ్రావణ్, గోపినాథ్, సుకర్ణ, సుధాకర్, రవి, శేఖర్, బాబు, రెడ్డయ్య, గంగయ్య, హనుమంతు, శ్రీరాములు, వెంకటేష్, శివశంకర్, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.