కార్పొరేషన్ ఎన్నికలు — పరిపాలనా విధానాలపై పోటీ
“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలనా వ్యవస్థలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసినప్పుడు, ఈ మార్పును ప్రజలే తమ మాటల్లో చెబుతున్నారు.”
అంటూ కిషోర్ గునుకుల,విజయలక్ష్మి గునుకుల జనసేన పార్టీ
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : నెల్లూరు నగరం (పాత 16వ) 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సాగిన జనసేన ఎన్నికల ప్రచారం. కార్పొరేషన్ సంస్థలు బలంగా, సమర్థవంతంగా పనిచేసినప్పుడే నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయి. స్థిరమైన పరిపాలన, సమన్వయం, ప్రజా ప్రయోజనమే కూటమి ప్రధాన లక్ష్యం. నగర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి, నగర సుందరీకరణకు కృషి చేస్తోంది. కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ అడ్డంకులు సృష్టించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం (పాత 16వ) 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా జనసేన ప్రచారం
కార్పొరేషన్లకు 16వ ఆర్థిక సంఘం ద్వారా అందే నిధుల అవసరం తెలిసినా, ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల విమర్శించారు. ప్రజా ప్రయోజనం కంటే స్వప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని వారు ఆరోపించారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించిన మొదటి రోజు నుంచే కాలువలు, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు సకాలంలో జరగాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని, స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, బలమైన మరియు అభివృద్ధి సాధించే దిశగా కార్పొరేషన్ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా (పాత 16వ) 21వ డివిజన్‌లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం ఈ రోజు కూడా ఉత్సాహంగా సాగింది. ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రతి కుటుంబాన్ని వారు కోరారు. స్థానికంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రజల సహకారం అవసరమని, అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాత్మక నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు వేగం పెరుగుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ప్రతిష్ఠాత్మక అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, సుందరీకరణకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, లక్ష్మీకుమారి, వీరమహిళలు ప్రవల్లిక, విజయ, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, సుప్రియ, కల్పన, కృష్ణమోహన్ రెడ్డి, నరహరి, శివకృష్ణ, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.