కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్‌లో రజత విజేత చంద్రకళకు ఘన స్వాగతం.
గన్నవరం, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్.
కెనడాలోని విన్నిపెగ్‌లో నిర్వహించిన 2026 కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 76 కేజీల సీనియర్ మహిళల విభాగంలో భారత్ తరఫున రజత పతకం సాధించిన విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ సీరా చంద్రకళకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
చంద్రకళ స్వదేశానికి చేరుకున్న సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు, తోటి ఉద్యోగులు, పవర్‌లిఫ్టింగ్ కోచ్‌లు, క్రీడాకారులు, కుటుంబ సభ్యులు విమానాశ్రయంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చంద్రకళను అభినందించి, శాలువాతో సత్కరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అంతర్జాతీయ స్థాయిలో చంద్రకళ సాధించిన రజత పతకం క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొని చంద్రకళకు శుభాకాంక్షలు తెలిపారు.