కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నాం : కమిషనర్ ఎం.జయకృష్ణ
తిరుపతి :వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ఎక్కడా మురుగునీరు నిలిచి అపరిశుభ్రత నెలకొనకుండా డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ తెలిపారు. నారాయణ పురం వద్ద డ్రైనేజి కాలువలో చెత్తచెదారం పేరుకుపోవడంతో మురుగునీరు ఎక్కువగా ఆగిపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుండి పిర్యాదులు అందాయని తెలిపారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా గురువారం నగరంలో సిల్ట్ తొలగింపు పనులు చెపట్టారని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో నగరంలో ఎక్కడా మురుగునీటి కాలువల్లో నీరు నిలవకుండా చెత్తచెదారం తొలగించే పనులు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నారాయణ పురం వద్ద కూడా డ్రైనేజీ కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి, వర్షపు నీరు, మురుగునీరు సజావుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఇంచార్జి డిసిపీ మూర్తి, ఏసీపీ పార్వతి ప్రియ ఉన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి