BREAKING
సీఎం చంద్రబాబు నాయకత్వంలో మారిటైమ్ హాబ్ గా ఏపీని తీర్చిదిద్దే దిశలో అడుగులు ఫ్రాన్స్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న విద్యార్థుల నిరసనలు 2026 నోబెల్ సాహిత్య పురస్కారం వశం చేసుకున్న ప్రఖ్యాత కెనడియన్ రచయిత్రి ఆన్ కార్సన్ సినీ పరిశ్రమకు నానా పటేకర్ మృతి తీరని లోటు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సింగరేణి పాఠశాలలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ ప్రారంభం సాంకేతికతను ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి ఉత్కంఠ రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్.. ఈ నెల 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ మీడియా రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం - వాస్తవ, విశ్వసనీయ సమాచారమే జర్నలిస్టుల లక్ష్యం కావాలి - తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి క్యూబాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం బాలల విద్య.. మహిళల హక్కులపై అవగాహన ర్యాలీ ప్రేక్షకుడి పల్స్ తెలిసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ మారుతి కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా అన్యక్రాంతానికి అడ్డుకట్ట... పార్కు స్థలానికి హైడ్రా రక్షణ క్షయ రహిత గ్రామంగా నాగారం ఆదర్శం

మూడు గంటల్లోనే ఐదేళ్ల చిన్నారి ఆచూకీ హిందూపురం ఆసుపత్రి నుంచి అదృశ్యం.. గౌని మేకలపల్లిలో సురక్షితంగా గుర్తింపు ఎస్పీ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత

Select Suryaa Now
మూడు గంటల్లోనే ఐదేళ్ల చిన్నారి ఆచూకీ  హిందూపురం ఆసుపత్రి నుంచి అదృశ్యం.. గౌని మేకలపల్లిలో సురక్షితంగా గుర్తింపు  ఎస్పీ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత

అనంతపురం బ్యూరో : హిందూపురం పట్టణంలో కనిపించకుండా పోయిన ఐదేళ్ల చిన్నారిని పోలీసులు కేవలం మూడు గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో పోలీసులు తక్షణమే స్పందించి ముమ్మరంగా గాలింపు చేపట్టడంతో చిన్నారి ఆచూకీ లభించింది.

హిందూపురం ఆసుపత్రిలో బుధవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో చిన్నారి కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో జిల్లాలోని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అదనపు ఎస్పీ కె.వి. మహేష్ పర్యవేక్షణలో సీఐలు ఆంజనేయులు, జనార్ధన్, జయప్రసాద్, ఎస్‌ఐ నరేంద్రతో పాటు క్రైమ్ పార్టీ, ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

చిన్నారికి సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రొద్దం మండలం గౌని మేకలపల్లి గ్రామంలో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

తల్లిదండ్రుల కృతజ్ఞతలు

తమ కుమార్తెను తక్కువ సమయంలోనే సురక్షితంగా గుర్తించి అప్పగించిన జిల్లా ఎస్పీ, హిందూపురం పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు వేగంగా స్పందించి చేపట్టిన గాలింపు చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత

అదనపు ఎస్పీ కె.వి. మహేష్ మాట్లాడుతూ చిన్నారుల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పిల్లలు కనిపించకుండా పోయిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చిన్నారిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంలో చురుకుగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అభినందించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.