తల్లిపాలు అమృతం, బిడ్డకు అదే మొదటి శ్రీరామరక్ష.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
బిడ్డకు తల్లిపాలు అమృతం అని, బిడ్డకు మొదటి శ్రీరామరక్ష అని అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని సుంకర వారి పాలెం లో పోషణ ఉత్సవం కార్యక్రమము గురువారం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్యానికి నిలయాలు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహారం అందజేస్తున్నామని దానిని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పి జయ శ్రీ, ఎస్ పద్మ, జి శేషమ్మ టి అనురాధ తదితరులు పాల్గొన్నారు.