జంఝావతి సాధన దీక్షకు సంఘీభావం తెలిపిన సీతారాంపురం రైతులు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ ఆధ్వర్యంలో దీక్షలు
గరుగుబిల్లి, మేజర్ న్యూస్: జంఝావతి ప్రాజెక్టు సాధనకై మేము సైతం జంఝావతి సాధన దీక్ష లో గరుగుబిల్లి మండలం కొంకడివరం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన రైతులు ఆదివారం పాల్గొన్నా రు.పార్వతీపురం ప్రాంత ప్రజల జీవనాడి లాంటి జంఝావతి ప్రాజెక్టు సాధనకై సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు, ప్రజాసంఘాలు రాజకీయాల కు అతీతంగా పార్వతీపురంలో నిర్వహిస్తున్న జంఝావతి ప్రాజెక్టు సాధన కమిటీ రిలే దీక్షలు 20 వ రోజు కు చేరుకున్న నేపథ్యంలో గరుగుబిల్లి మండలం కొంకడివరం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన రైతులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ ప్రజలు నేడు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సిందేనని తెలిపారు.సుమారు 75 గ్రామాల రైతులకు,ప్రజలకు త్రాగునీరు, సాగు నీరు అవసరాలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన జంఝావతి ప్రాజెక్టు పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని, దేశంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నప్పటికీ అత్యంత వెనుకబడిన పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్మించక పోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే జంఝావతి ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు.ఈసందర్బంగా సీతారాంపురం గ్రామ రైతులు మాట్లా డుతూ ప్రాజెక్ట్ సాధించే వరకు పోరాటంకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.దీక్షలో సాధన సమితి నేతలతో పాటు సీతారాంపురం గ్రామానికి చెందిన రైతులు బడే త్రినాధరావు,చీకటి సీతారాములు,బి సూర్యనారాయణ, సిహెచ్ కృష్ణ, బి గురువులు,బి సింహాచలం, బి రమేష్ నాయుడు,ఎం వెంకటరమణ,పి వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.