జెడ్పీ చైర్ పర్సన్ సిరి సహస్ర (సిరమ్మ)ను మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పుకాపు సామాజిక వేధిక సంఘం సభ్యులు.…
వియనగరం మేజర్ న్యూస్:
విజయనగరం ధర్మపురి లో గల క్యాంప్ కార్యాలయం (సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్) నందు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు ,ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి సిరి సహస్ర (సిరమ్మ)ను మర్యాద పూర్వకంగా విజయనగరం తూర్పు కాపు సామజిక వేదిక జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షులు అంబ్బల్ల అప్పలనాయుడు ,ప్రధాన కార్యదర్శి అర్లే కృష్ణ రావు ,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు , రాష్ట్ర కార్యదర్శి మంత్రి రమణ మూర్తి ,
రాష్ట్ర కన్వీనర్ రొంగలి రామారావు , తూర్పు కాపు పెద్దలు , పలువురు ముఖ్య నాయకులు గురువారం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి, దుస్సాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.