BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

జనవాణి వినతుల పరిష్కారానికి కృషి

Select Suryaa Now
జనవాణి వినతుల పరిష్కారానికి కృషి

 

నర్సీపట్నం సెప్టెంబరు 28 మేజర్ న్యూస్ :

జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీర సూర్యచంద్ర తెలిపారు. నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, ఆస్తి తగాదాలు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించి మొత్తం 11 వినతులు అందినట్లు సూర్యచంద్ర తెలిపారు. నాతవరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌తో పాటు ఇతర సిబ్బంది కొరతపై పలువురు ఫిర్యాదు చేయగా, ఈ విషయాన్ని ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.
మండలంలోని లింగంపేట పంచాయతీ  బుచ్చంపేట గ్రామస్తులు గ్రామానికి ఉపయోగపడే బావి వద్దకు వెళ్లేందుకు కనీస రహదారి సౌకర్యం లేదని, రోడ్డు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తామని సూర్యచంద్ర తెలిపారు. ప్రభుత్వ శాఖల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను జనసేన కార్యాలయంలో తెలియజేయాలని, పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో నాతవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు సూరి శేఖర్, నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.