జక్కంపూడి రామ్మోహన్ రావు కు ఘన నివాళులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
మాజీ మంత్రి, దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా రాజమహేం ద్రవరం కంబాల చెరువు జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి పలువురు నాయకులు, అభిమా నులు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.ఈ సందర్భం గా కోడి కోట మిత్ర బృం దం,జక్కంపూడి రామ్మో హన్ రావు అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెం టరీ నియోజకవర్గ ఇన్ చార్జి గూడూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహన్ రావు జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయక మని అన్నారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గం లో తనయులు జక్కం పూడి రాజా, జక్కంపూడి గణేష్ పయనించాలని ఆకాంక్షించారు. తండ్రి మాదిరిగానే ప్రజలతో మమేకమవుతూ,వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న సోదరులిద్దరి తీరు అభి నందనీయమన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, తన తండ్రి చూపిన బాటలోనే నడు స్తామని స్పష్టం చేశారు. కార్మికులు, కర్షకులతో పాటు అన్నివర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.మాజీ రుడా చైర్మన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహన్ రావు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్నారని పేర్కొ న్నారు.ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు, స్ఫూర్తిని కుమారులు కొనసాగించాలని సూచించారు.రాజానగరం మాజీ జడ్పీ టీసీ సభ్యుడు వాసంశెట్టి పెద వెంకన్న, వైఎస్సార్ సీపీ మాజీ నగర అధ్య క్షుడు నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక సంఘ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రామ్మోహన్ రావు, అనం తరం మంత్రిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎండీ ఆరిఫ్, వక్కపాటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు పాల్గొని జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘనంగా నివాళులర్పిం చారు.