జాతీయ న్యాయ సేవల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
విజయవాడ మేజర్ న్యూస్ : హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లోని ఓ హోటల్‌లో జాతీయ న్యాయ సేవల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల ప్రకాష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా మెడికల్ ఆఫీసర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది సమాజ సేవకులను సత్కరించారు. చట్టపరమైన హక్కులు, సామాజిక సమస్యలు, పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ బొడ్డపాటి దాసు, డాక్టర్ సాంబేలు శాంతిబాయి, శ్రీనిలత తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ సేవలను ముఖ్య అతిథి అభినందించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.