-ఇది కక్షసాధింపుల ప్రభుత్వం కాదు, ప్రజాభివృద్ధి ప్రభుత్వం -ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్
"యుద్ధం వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు నా గొంతు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇది శాంతి సమయం. ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన సమయం. అందుకే రాయలసీమ పౌరుషానికి తగిన స్పీచ్ మాట్లాడట్లేదు. రాయలసీమ అభివృద్ధికి అవసరమైన విధంగా మాట్లాడుతున్నా. గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం" అంటూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ పౌరుషాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడవలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఈ నేల రూపురేఖలను అభివృద్ధి పథంలో మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.