హులికల్లు పంచాయతీ బరిలో తెదేపా మద్దతు దారు సర్పంచి అభ్యర్థి వాల్మీకి తిప్పే స్వామి..
రాయదుర్గం సూర్య ప్రతినిధి: ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి..... కల్యం పంచాయతీ అభివృద్ధికి బాటలు వేద్దాం... ప్రజలకు విజ్ఞప్తి చేసిన ... వాల్మీకి తిప్పే స్వామి రాయదుర్గం మేజర్ న్యూస్ : హీరేహాళ్ మండలంలోని హులికల్లు పంచాయతీ బరిలో తెదేపా మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి తెదేపా సీనియర్ నాయకుడు, మండల జాయింట్ సెక్రెటరీగా కల్యం తిప్పేస్వామి బరిలో నిలిచారు... ఈ సందర్భంగా మేజర్ న్యూస్ తో తిప్పేస్వామి మాట్లాడుతూ హులి కల్లు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహాయశక్తుల మేర కృషి చేస్తామని, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు నిలువెత్తు నిదర్శనం హులికల్లు లో సిసి రోడ్లు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తిప్పే స్వామి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా తమకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులకు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి పాటిల్ శైలజ మోహన్ రెడ్డికి, మండల కన్వీనర్ తలారి గంగాధర్ కు మొండి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.…
సూర్య ప్రతినిధి: శివప్రసాద్ రాయదుర్గం ఇంచార్జ్