BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం

Select Suryaa Now
హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం

విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు హోల్డింగ్ ఏరియాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం వినాయకుని గుడి, కెనాల్ రోడ్, వన్‌టౌన్ ప్రాంతాల్లోని హోల్డింగ్ ఏరియాలను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిరంతర తాగునీటి సదుపాయం అందుబాటులో ఉంచడంతోపాటు, వినియోగించిన నీటి సీసాలు, ఇతర వ్యర్థాలను సేకరించేందుకు చెత్తకుండీలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నట్లు వివరించారు. హోల్డింగ్ ఏరియాల్లో భక్తుల రాకపోకలు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ, ప్రతి విభాగంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. ఒక విడత భక్తులు ముందుకు సాగిన వెంటనే తదుపరి విడత భక్తులకు కూడా శుభ్రమైన పరిసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భక్తుల ఆరోగ్యం, సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, ప్రధాన వైద్య ఆరోగ్య అధికారి డా. సి.హెచ్. నిర్మల గ్లోరీ, దేవాదాయ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రమాదేవి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.