హేమావతిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం
స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలి
--హలుకూరు కాంతరాజు, వాగేష్
అమరాపురం మేజర్ న్యూస్ న్యూస్ అక్టోబర్ 20: మండల పరిధిలోని హేమావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు, గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం శ్రీ సత్యసాయి జిల్లా కోఆర్డినేటర్, అమరాపురం జడ్పీటీసీ అభ్యర్థి హలుకూరు కాంతరాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాగేష్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హలుకూరు కాంతరాజు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామస్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల మద్దతు కూడగట్టాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అమరాపురం మండల కన్వీనర్ త్రిలోకనాథ్, ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీటీసీ-1 సుమిత్ర నరసింహమూర్తి, ఎంపీటీసీ-2 ఉమా నంజుండ, ఎంపీటీసీ-3 శ్రీనివాస్, జిల్లా నాయకులు తాలూకు నాయకులు, మండల నాయకులు, స్థానిక నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.