గుర్రం జాషువా సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
విజయనగరం టౌన్ (మేజర్ న్యూస్)
కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు అన్నారు. గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో జాషువా చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యంలో సామాజిక ప్రయోజనం కోసం కలం పట్టిన జాషువా రచనలు కుల,మత, వర్గ భేదాలకు అతీతంగా సామాజిక చైతన్యాన్ని కలిగించాయని చెప్పారు. మానవత్వమే మహాన్నతమని జాషువా తన సాహిత్యం ద్వారా చాటి చెప్పారని చెప్పారు.