గురవాయిగూడెం మాజీ సర్పంచ్ గుబ్బల సత్యవేణి టీడీపీలో చేరిక
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,మండలంలోని గురవాయిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ గుబ్బల సత్యవేణి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చింతలపూడిలోని కూటమి కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆమెకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు అనుచరులు కూడా కూటమిలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమిలో చేరిన వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.