'గురజాడ నాటక శిక్షణ' పేరిట రాష్ట్రవ్యాప్తంగా నాటక శిబిరాలు.. రూ. 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం:మంత్రి కందుల దుర్గేష్
పీపీపీ విధానంలో అర్హత ఉన్న నాటక సమాజాలు,నాటక పరిషత్తులు,గుర్తింపు పొందిన నాటక సంస్థలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో నాటక శిక్షణా శిబిరాల నిర్వహణ.
మహాకవి గురజాడ 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీదుగా నాటక శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం జీవో. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. బాలల, యువజన నాటక శిక్షణతో పాటు రచయితలు, దర్శకులు, మేకప్, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక శిక్షణ. కళాకారులను అత్యుత్తమ ప్రమాణాలతో నాటకోత్సవాలకు సన్నద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.