BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

గుమ్మపాడులో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు..

Select Suryaa Now
గుమ్మపాడులో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు..

 

అశోకం నేచురల్ టూరిజం, కోతడ్డపనస అయ్యప్ప ఆలయ ప్రాంతాల అభివృద్ధికి నిధులు

గుమ్మపాడు, నవంబర్ 12 మేజర్ న్యూస్ :

సారవకోట మండలంలోని గుమ్మపాడు ఎంపీటీసీ పరిధిలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ వెల్లడించారు. అశోకం నేచురల్ టూరిజం ప్రాంతంతో పాటు కోతడ్డపనస అయ్యప్ప ఆలయ పరిసరాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు వివరించారు. మండల, డివిజనల్ రెవెన్యూ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల ప్రాధాన్యతను వివరించడంతో నిధుల మంజూరుకు కృషి జరిగిందన్నారు.

ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్‌కు కత్తిరి వెంకటరమణతో పాటు రెండు పంచాయతీల ప్రజలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతాలకు భక్తులు, పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని, తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.