గుమ్మడిదూరు ఎంపీటీసీ నక్కా చిన్నపుల్లయ్యకు ఎమ్మెల్యే తాతయ్య అభినందనలు
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ : గుమ్మడిదూరు ఎంపీటీసీ అభ్యర్థిగా విజయం సాధించిన నక్కా చిన్నపుల్లయ్య సోమవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), ఆయన సోదరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీరాం చినబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన చిన్నపుల్లయ్యకు ఎమ్మెల్యే తాతయ్య, చినబాబు అభినందనలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని నక్కా చిన్నపుల్లయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలంపల్లి డ్యాం చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు పొన్నం బాలాజీ, మాజీ సొసైటీ అధ్యక్షులు పొందూరు నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంచేటి రాంబాబు, పొన్నం రవికుమార్(రాయుడు), తెలుగుదేశం నాయకులు మండెపూడి రామ్మోహనరావు, తెలుగు యువత నాయకులు పొందూరు గోపి తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా.