BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

గుడివాడలో కూటమి సునామీ..

Select Suryaa Now
గుడివాడలో కూటమి సునామీ..

గుడ్లవల్లేరు మేజర్ న్యూస్ : గుడివాడ నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజేతలతో సోమవారం గుడివాడ ప్రజా వేదికలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలకు చెందిన జడ్పీటీసీలు అంగడాల భారతి, దుడ్ల ప్రదీప్ కుమార్, వర్రె బలరామకృష్ణ, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతలను ఆలింగనం చేసుకుని అభినందించారు. మహిళా ప్రజాప్రతినిధులకు నమస్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలకు మూడు, 32 ఎంపీటీసీ స్థానాలకు 28 స్థానాలను కూటమి కైవసం చేసుకుందని తెలిపారు. నందివాడలో 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారిగా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుచుకోవడం చారిత్రాత్మకమన్నారు. గుడ్లవల్లేరులో 2024 ఎన్నికల కంటే అధిక ఓట్లు సాధించామని, పలు గ్రామాల్లో 69 నుంచి 71 శాతం వరకు ఓటర్లు కూటమికి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నందుకే ఈ విజయం సాధ్యమైందని, ప్రజలు ఇచ్చిన తీర్పును కూటమి ప్రభుత్వానికి బహుమతిగా అందిస్తున్నామని అన్నారు. పని చేసేవారికే ప్రజలు పట్టం కడతారని, ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. ఓటమి పాలైన నాలుగు స్థానాల బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు గుడివాడలో నమోదయ్యాయని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాయకుడంటే కష్టసమయంలో పారిపోకుండా ముందుండి నడిపించాలని, ప్రజల కోసం పనిచేయడమే నిజమైన దమ్ము అని అన్నారు. పదవి అలంకారం కాదని, బాధ్యత అని పేర్కొంటూ గెలిచిన ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం జడ్పీటీసీలు వర్రె బలరామకృష్ణ, అంగడాల భారతి, దుడ్ల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తమను గెలిపించిన ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాము నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, కార్యకర్తల కష్టం, ప్రజల నమ్మకానికి అభివృద్ధి ద్వారా రుణం తీర్చుకుంటామని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన నేత సందు పవన్, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.  

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.