BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

గ్రామీణులకు మెరుగైన వైద్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం...

Select Suryaa Now
గ్రామీణులకు మెరుగైన వైద్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం...
  •  ప్రాథమిక వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత.
  • ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

శ్రీకాకుళం, అక్టోబర్ 6 మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి గుమ్మం వద్దకే అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ (విలేజ్ హెల్త్ క్లినిక్స్) వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధికారులతో కలిసి ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ చేయడంలో భాగంగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’లుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.

ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి తగిన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేష్‌కుమార్, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.