BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

గ్రామీణ వైద్య రంగానికి మహర్దశ.... జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి వెల్లడి

Select Suryaa Now
గ్రామీణ వైద్య రంగానికి మహర్దశ.... జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి వెల్లడి

పార్వతీపురం, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ : నాన్-కమ్యూనికేబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధులను ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ప్రధాన ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి పేర్కొన్నారు. ఈ క్లినిక్ ల ఏర్పాటుతో గ్రామీణ వైద్య రంగానికి మహర్దశ వచ్చినట్లేనని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, 15వ ఆర్ధిక సంఘం మరియు ఉపాధిహామీ నిధులతో మన్యం జిల్లాలో రూ. 406.34 లక్షలతో నూతనంగా నిర్మించిన 11 "ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ - విలేజ్ హెల్త్ క్లినిక్" భవనాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లాస్థాయిలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి పాల్గొని రిబ్బన్ కట్ చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 11 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వాటిలో పాలకొండ నియోజకవర్గంలో 7 క్లినిక్‌లు, సాలూరు నియోజకవర్గంలో 2, కురుపాం నియోజకవర్గంలో 2 క్లినిక్‌లు ప్రారంభించుకోవడం జరిగిందని ఆమె వెల్లడించారు.  గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర ప్రాథమిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. అధునాతన వసతులతో అందుబాటులోకి వచ్చిన ఈ భవనాలు స్థానిక గిరిజన, గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని జేసీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డా. జి.నాగభూషణ రావు, ప్రోగ్రాం మేనేజర్లు, డెప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.