గ్రామాల్లో రూ.11,085 కోట్ల బడ్జెట్ తో మారనున్న రూపు రేఖలు --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్
కైకలూరు, సూర్య న్యూస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ పల్లె పండగ - 3.0 లో భాగంగా కైకలూరు మండలంలోని ఆచవరం, శ్యామలాంబపురం, వింజరం, ఆనందరావుపేట మరియు తామరకొల్లు గ్రామాలలో నూతన సీసీ రోడ్లు నిర్మాణ పనులకు భూమి పూజ చేసారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతు గ్రామాలల్లో నిజమైన పండగ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా రూ. 11,085 కోట్ల భారీ బడ్జెట్‌తో పల్లె పండుగ 3.0 అనే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ 3.0 ద్వారా సుమారు 15,500 కిలోమీటర్ల మేర బీటీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. రోడ్ల నిర్మాణం వల్ల గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగై, ప్రజల రాకపోకలు సులభతరమవుతాయని తెలియజేసారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో కనీసం రోడ్లు వేసే నాథుడే కరువయ్యారు. వర్షం వస్తే చాలు రోడ్లన్నీ బురదమయమై, స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఆసుపత్రికి వెళ్లే గర్భిణీలు, వృద్ధులు పడే నరకయాతన మనమంతా చూశాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పల్లెల్లో రోడ్ల విప్లవానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, నియోజకవర్గ టిడిపి కన్వినర్ కొత్తా నాగేంద్ర కుమార్ ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎం రమేష్ కైకలూరు రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లా