BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శత శాతం కూటమిదే విజయం: ఎమ్మెల్యే

Select Suryaa Now
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శత శాతం కూటమిదే విజయం: ఎమ్మెల్యే

చీపురుపల్లి, సూర్య :  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని  ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని కళా వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తలెత్తిన చిన్నపాటి లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీ రహితంగా జరగనున్న ఈ ఎన్నికల్లో కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులు, అవకాశాలను బట్టి కూటమిలోని ఇతర పార్టీలకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో జరిగిన చర్చల అనంతరం గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌తో పాటు సివిల్ సప్లై అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడంతో పాటు, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత చెల్లింపుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా సకాలంలో నగదు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సొసైటీలు, ఉత్పత్తిదారుల సంఘాలు, వెలుగు సంఘాలకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించారు. ధాన్యం సేకరణలో రైతులకు మరింత సౌకర్యవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు.
రైతుల పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. రైతుల బాగోగులు, వ్యవసాయ రంగ అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.