గంజాయి కేసుల్లో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్
విజయనగరం, సూర్య : విజయనగరం పట్టణం దాసన్నపేట నాగవంశం వీధికి చెందిన (1) జరజాపు గిరి చందు దుర్గా ప్రసాద్ (30 సం.లు) మరియు విశాఖపట్నం సిటీ డాబా గార్డెన్ కు చెందిన యాలస భాను ప్రసాద్ (26 సం.లు) అనే ఇద్దరు నిందితులు తరచూ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్ అమలు చేసి, నవంబరు 11న విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
గంజాయి కేసుల్లో అరెస్టుకాబడిన నిందితుల్లో పరివర్తన తీసుకొని వచ్చుటలో భాగంగా వారిని పలుమార్లు కౌన్సిలింగ్ చేసి, నేర ప్రవృత్తిని విడిచిపెట్టేందుకు కృషి చేసి, ఒక సం. వరకు బెయిలు రాకుండా కఠిన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ:
యాలస భాను ప్రసాద్ (26 సం.లు) పై ఇప్పటికే రెండు గంజాయి కేసులు, జరజాపు గిరి చందు దుర్గా ప్రసాద్ (30 సం.లు)పై మూడు గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు.
నిందితుల ప్రవర్తనలో పరివర్తన తీసుకొని వచ్చుటలో భాగంగా వారికి పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు.
అయినప్పటికీ నిందితులు నేర ప్రవృత్తిని మార్చుకోకుండా పదేపదే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇద్దరిపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న 17మందిపై పి.డి.యాక్ట్ అమలు చేసి, ఒక సం. వరకు బెయిలు రాకుండా చర్యలు చేపట్టి, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ప్రజల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసుశాఖ కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణ, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా యాలస భాను ప్రసాద్ (26 సం.లు)ను బొబ్బిలి రూరల్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలోను, జరజాపు గిరి చందు దుర్గా ప్రసాద్ (30 సం.లు)ను విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, 1 సం. వరకు బెయిల్ రాకుండా చర్యలు చేపట్టి, ఇరువురిని విశాఖ సెంట్రల్ జైలుకిమంది తరలించారని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.