BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఘనంగా విశ్రాంత ఉద్యోగుల 43వ ఆవిర్భావ దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా విశ్రాంత ఉద్యోగుల 43వ ఆవిర్భావ దినోత్సవం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం "43వ  ఆవిర్భావ దినోత్సవం" ఇంకొల్లులో ఘనంగా నిర్వహించారు. సభకు ఇంకొల్లు శాఖ అధ్యక్షులు కరి కమలేశ్వరరావు అధ్యక్షత వహించారు. 13-10-1984న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  సంఘం ఏర్పాటు చేశారని, అప్పటి నుండి విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ, పరిష్కారానికి కృషి చేస్తున్నదని పలువురు వక్తలు వివరించారు. ఇంకొల్లు లో ఉపఖజానా కార్యాలయము లేకపోయినప్పటికి, ఇంకొల్లులో ఈ సంఘాన్ని చేయుటకు కృషి చేసిన  కరి శేషయ్య, రావి హనుమంతరావు,  చుండూరి రామయ్య లకు నివాళులు అర్పించారు. అంబటి జానకి రామయ్య జ్ఞాపకార్ధం కుటుంబ సభ్యులు ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చి భవనాన్ని ఏర్పాటు చేయడం, రావుల బాపయ్య, దాచూరి రామిరెడ్డి, ఆదినారాయణ ల సహకారంను గుర్తు చేసుకున్నారు.  80సంవత్సరాలు నిండిన సూపర్ సీనియర్ సభ్యులకు సన్మానించారు. పెన్షనర్ ల ఆరాధ్యదైవం కీ.శే. నకారా విగ్రహానికి సీనియర్ సభ్యులు చల్లపల్లి వెంకటేశ్వర్లు పొనుగుపాటి వెంకటసుబ్బారావు, నూతలపాటి చెన్నకేశవరావు లు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తగిరిశ వీరాంజనేయులు, కోశాధికారి భవనం హరేరామి రెడ్డి, బాపట్ల జిల్లా గౌరవాధ్యక్షులు ఆవుల హనుమంతరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉప్పల వెంకట గోపాలరావు, కార్యవర్గ సభ్యులు  నార్నె తాతయ్య, కాకి జర్మియా జయరాజ్, అమ్మనమంచి శ్రీనివాసరావు, చిడిపుడి నాగేశ్వరరెడ్డి, ఉదయకుమారి, రాధారాణి, బ్రహ్మనాయుడు, కందిమళ్ళ బ్రహ్మయ్య, సాదినేని వెంకటేశ్వర్లు, జంధ్యాల వెంకట రమణ మూర్తి, వజ్జా వెంకటేశ్వర్లు, సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.