BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా వేసన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి.

Select Suryaa Now
గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా వేసన  ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి.

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నివారించేందుకు 14 సంవత్సరాల బాలికలకు నిర్వహిస్తున్న హెచ్‌పీవీ టీకా కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించే ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణలో ముందస్తు టీకా కార్యక్రమాల ప్రాధాన్యతను వైద్యులు వివరించారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న టీకా కార్యక్రమాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న వయసులోనే తగిన వైద్య సలహాలతో హెచ్‌పీవీ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు సహాయపడుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా కార్యక్రమం సందర్భంగా బాలికలకు అవసరమైన వైద్య సూచనలు అందించారు. టీకా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ఆరోగ్య సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాసులు, మంజుల, ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.